సూచిక

29, ఆగస్టు 2011, సోమవారం

శ్రీ జగన్నాథ అష్టకం రచించినది ఎవరు?

బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు
పూరీ జగన్నాథస్వామి క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన వైష్ణవ క్షేత్రాలలో మాదిరిగా కాక, ఇక్కడ తోబుట్టువులు దేవుళ్ళుగా వెలశారు. వీరే జగన్నాథుడు, బలభద్రుడు, మరియు సుభద్ర. స్థానికులు "జగన్నాథో! బొలభోద్రో! సుభొద్రో!" అని ఎలుగెత్తి పిలుస్తారు.  ఒక విశేషం ఏమిటంటే,  శ్రీ జగన్నాథునికి ఎన్ని భోగాలు వున్నా, లేకున్నా తవిటి రొట్టె (తవుడుతో చేసిన రొట్టె) భోగం తప్పని సరిగా వుండాలి. పూరీ జగన్నాథ స్వామిపై ప్రసిద్ధమైన "జగన్నాథ అష్టకం" వుంది. ఇది "కదాచిత్ కాళిందీ తట విపిన సంగీతక వరో..అని ప్రారంభమై ప్రతి నాలుగవ పాదం "జగన్నాథ స్వామీ నయన పథగామీ భవతు మే" అని పూర్తవుతుంది. అయితే ఈ అష్టకం శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించారని పలు వెబ్ సైట్లలో కనిపిస్తుంది. కాని అది ఎంత వరకు వాస్తవం? ఇందులో శ్రీ శంకరాచారుల వారిని కించ పరచే ఉద్దేశ్యం ఎ మాత్రం లేదని చదువరులకు మనవి.  శ్రీ ఆది శంకరులు మనకు ఎన్నో మధురమైన స్తోత్రాలు, అష్టకాలు అందించారు, ఎన్నో భాష్యాలు వ్రాసారు. 

అసలు రచయిత:
అయితే ఈ జగన్నాథ అష్టకం రచించినది కీ.శే. శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారు (1759-1830). వీరు ప్రస్తుత విజయనగరం జిల్లాలోని పార్వతీపురం పట్టణం దగ్గర గల నాగూరు అగ్రహారమునకు చెందిన వారు. "అభినవ కాళిదాసు" అని బిరుదు పొందిన శాస్త్రి గారు "సమాస కుసుమావళి", "శబ్ద మంజరి", "రామాయణ సంగ్రహము", "విభక్తి విలాసము" అను ప్రముఖ రచనలు చేసారు.  శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారు మా మాతామహులైన కీ.శే. శ్రీ నడిమింటి పతంజలి శాస్త్రి (1906 - 1972) గారికి స్వయాన ముత్తాత గారు.  

పొరపాటుకు కారణం:
అయితే రచయిత విషయంలో జరిగిన ఈ పొరపాటుకు మొదటి కారణం "వావిళ్ళ ప్రెస్" వాళ్ళు తమ "బృహస్తోత్ర రత్నాకరం" లో ఈ అష్టకం రచయిత శ్రీ ఆది శంకరాచార్యుల వారు అని మరల మరల ముద్రించడం. ఒక పర్యాయం మా తాత గారైన కీ.శే. శ్రీ నడిమింటి పతంజలి శాస్త్రి గారు ఈ పొరపాటును వావిళ్ళ వారి దృష్టికి తీసుకు రాగా, సదరు ప్రెస్సు వాళ్ళు తప్పు సరిదిద్దడం అటుంచి, అసలు రచయిత పేరు లేకుండా ముద్రించడం మొదలు పెట్టారు. అంతేకాదు ఒడిస్సా (ఒరిస్సా) రాష్ట్రానికి సంబంధించిన వెబ్ సైట్లలో సైతం జగన్నాథ అష్టకం "శ్రీ శంకరాచార్యుల విరచితం" అని ప్రచురించారు. దీనిని అంతర్జాలంలోని పలు వెబ్ సైట్లు వారు ఈ తప్పునే ఒప్పుగా ప్రచురించారు/ప్రచురిస్తున్నారు.
 

పరిశోధన - జువులు:
(1) మా మేనమామ గారైన ఆచార్య నడిమింటి శ్రీ రామచంద్ర శాస్త్రి గారు (విశాఖ పట్టణం వాస్తవ్యులు)  ఈ విషయము మీద పరిశోధన చేసి కొంత సమాచారం సేకరించారు. వారు (శ్రీ నడిమింటి శ్రీరామచంద్ర శాస్త్రి గారు)  ఇటీవల డిసెంబరు 23, 2010 న సకుటుంబ సమేతంగా శృంగేరి లోని శారదా పీఠం లోని ప్రస్తుత శ్రీ శంకరాచార్యులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారిని సందర్శించి, శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారు తన "ప్ర-ప్ర-పితామహులు" అని చెప్పగా, వెంటనే శ్రీ ఆచార్యుల వారు "సమాస కుసుమావళి" లోని శ్లోకాలు అనర్గళంగా చెప్పడం మొదలు పెట్టారట. ఈ అష్టకమే కాక, శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారి ఇతర రచనలను కొందరు ప్రకాశకులు (publishers) వేరే రచయితల పేర్లతో పేర్కొనడం శ్రీ భారతీ తీర్థ స్వామి వారి దృష్టికి తీసుకు రాగా, శ్రీ ఆచార్యుల వారు ఈ రచనలు శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారివేనని ద్రువీకరించారట. 

(2) మరొక నిరూపణ లేక నిర్ధారణ ఏమిటంటే, శ్రీ ఆదిశంకరులు జన్మించిన కాలడి (కేరళ) లో గల "శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం" వారు కూడ, శ్రీ ఆది శంకరాచార్యుల 'సర్వరచనల సంకలనాల'లో కూడా "జగన్నాథ అష్టకం" లేదని దృవ పరిచారట.  

(3) ఇది అంతర్జాల యుగం. ప్రస్తుతం ఉన్న దాదాపు అన్ని వెబ్ సైట్లలోనూ జగన్నాథ అష్టకం శ్రీ శంకరాచార్య విరచితం అని వుంటుంది. అయితే ఒకే ఒక వెబ్ సైట్ మాత్రం ఈ అష్టక రచయిత పేరు సరిగ్గా సూచిస్తుంది. అది -

(4) అంతేకాక అనేకానేక ఆధ్యాత్మిక గ్రంథాలను దశాబ్దాలుగా సేవాదృష్టితో సరసధర ప్రతులుగా ప్రచురించుతూ ఉండిన స్వర్గీయ శ్రీ పురిపండా రాధాకృష్ణ మూర్తి గారు కూడా తమ "శ్రీ కృష్ణ స్తోత్ర రత్నములు" మొదలగు గ్రంథములలో శ్రీ జగన్నాథాష్టకము శ్రీ నడిమింటి సర్వమంగళ శాస్త్రి విరచితమని స్పష్టముగా ప్రచురించినారు.

(5) ఇవికాక, 1937  లో ప్రచురించబడిన మహాకవి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి "చాటుపద్య మణిమంజరి" అన్న గ్రంథము లోనూ, 1972 లో 'స్వాతి' దీపావళి ప్రత్యెక సంచికలో దేవీ భాగవతం మొదలగునవి రచించిన ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథ రచయిత శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారు, "వాగ్మి శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి" అన్న తమ వ్యాసం లోనూ శ్రీ జగన్నాథాష్టకము నడిమింటి వారిదని వ్రాసినారు. యామిజాల వారై తే శ్రీ సర్వ మంగళేశ్వర శాస్త్రి గారిని ఏ పరిస్థితులు శ్రీ జగన్నాథాష్టకము ఆశువుగా చెప్పారో కూడా ప్రస్తావించారు.

జగన్నాథ అష్టకం వ్రాసిన వైనం:
ఒక తూరి శాస్త్రి గారిపై అసూయతో, అవమానింపదలచిన కొందరు, అశుభ్రంగా మురికి బట్టలతో ఉన్న ఒకనిచే ఎంగిలి చిప్పలో జగన్నాథ స్వామి వారి ప్రసాదం పంపేరు. దానిని నిరాకరించిన శాస్త్రి గారికి ప్రసాద దూషణ కారణంగా కన్నులు పోయినవి. అప్పుడు శాస్త్రి గారు శ్రీ జగన్నాథ స్వామి పై ఆశువుగా  "నయనపగామీ భవతుమే" (నా కన్నులకు మార్గము / దృష్టి ఇమ్ము) అన్న మకుటంతో అష్టకం చెప్పి వేడుకున్నారు.  ప్రసన్నులైన శ్రీ జగన్నాథస్వామి దృష్టి నివ్వగా శ్రీ శాస్త్రి గారు, "ప్రభూ నేను తమ ప్రసాద దూషణ చేసినందుకు తమరు విధించిన శిక్షకు పాత్రునే. కాన నా ఒక కన్ను తీసుకో స్వామీ. కాని నీ చక్కని రెండు కనులతో అందరినీ కృపా దృష్టితో చూడు" అన్నారు. 'దేవునితోనే చతుర చమత్కారము సేయగల మహా "వాగ్మి" శ్రీ సర్వమంగళేస్వర శాస్త్రి గారు' అని యామిజాల వారు వ్రాసారు. కాగా తమ జీవిత ద్వితీయార్థంలో శ్రీ సర్వమంగళేస్వర శాస్త్రి గారు ఒక కన్నుతో ఉండే వారన్నది చరిత్ర.

(6) ఈ విషయం సుమారు 1650 నుండి తెలిసిన "శ్రీ నాగూరి నడిమింటి వారి వంశ చరిత్ర" ద్వారా కూడా తెలియును.
 
ఈ సందర్భములో గమనించవలసిన విషయము ఒకటున్నది.  శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారు ఓడిశా రాష్ట్ర సరిహద్దులోగల ఉత్తరాంధ్ర జిల్లా అయిన నాటి విజాగపటం జిల్లా వాసి. పూరీ క్షేత్రంలో వారిని "దక్షిణ శాస్త్రి" అనేవారు. ఉత్తరాంధ్రకు దూరమైన ప్రాంతాల వారికి తగు సంచార సాధనాలులేని నాటి రోజులలో  సర్వమంగళేశ్వరుల గురించి తెలియకుండేది. ఇంకా ఎందరెందరో స్తోత్రకారులు తమ తమ రచనలు ప్రాచుర్యం పొందాలనే ఉద్దేశ్యంతో శ్రీ శంకరాచార్యులు మరియు ఇతర మహానుభావులు పేరుమీద విడుదల చేసేవారని పండితులు అంటారు. మరియు ఒకే దేవుడు లేదా దేవత పై ఒకరి కంటే ఎక్కువ కవులు స్తోత్రాలు వ్రాసారు. ఉదాహరణకు మాకు తెలిసి సూర్యదేవునిపై  సర్వమంగళేశ్వరుల రచనతో కలిపి మూడు స్తోత్రాలునాయి. గణపతిపై అరడజను స్తోత్రాలున్నాయి.

సారాంశము:
అందువలన, పైన పేర్కొన్న వివరణలతో, ఆధారాలతో సవినయంగా, 'కదాచిత్ కాళిందీ తట..' అన్న శ్రీ జగన్నాథ అష్టకం శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి  కృతమని విన్నవించడమైనది. 

YSµm¸ék¸¶¨àOµA- §ñ ¶mfº£ÀAdº ¶ª±µö¶¢ÀASµyɶ¥ö±µ ¥¹»ªåò £±µWhµ¶¢ÀÀ
Oµl¸Wh³ O¸zAl¿ hµd £»p¶m ¶ªAS¿hµOµ ¶¢±Ð
¶¢ÀÀl¸ Sоp m¸±¿ ¶¢lµ¶m Oµ¶¢Àv¹«¸ölµ ¶¢ÀlûµÀ¶pB |
±µ¶¢Ã ¶¥AsûµÀ sñ¶®î¶¢À±µ¶pi SµgÉ¥¹±¼Ûhµ ¶plÐ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 1 ||

sûµYÉ ¶ªÊ¢ï Ê¢gÀ´¢À ¦±µ»ª ¦Q»pAVµA Oµdº hµdÉ
lµÀOµÃv´¢À Êmh¸ñÊmå ¶ª¶¬Vµ±µ Oµd¹°µA £lûµlµhÉ |
¶ªl¸ §ñ ¶¢ÀlµìýÅAl¸¶¢¶m ¶¢¶ªi xv¹ ¶p±¼Vµ±ÀÇÃ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 2 ||

¶¢À¶®AsûÑlɾªå±É Oµ¶mOµ ±µÀW±É ov ¦P±É
¶¢¶ªh³ q¸ñ«¸l¸¶m嶪ù¶¬Y svsûµlÉñg swm¸ |
¶ªÀsûµl¸ñ ¶¢Àlûµï¶ªæ¶ªùOµv ¶ªÀ±µÊª¢¸¶¢¶ª±µlÐ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 3 ||

Oµk¸ q¸±¸¢¸±¸¶ªùYv YvlµÊ¥ñgº ±µÀW±Ð
±µ¶¢Ã ¢¸g½ «Õ¶¢À ¶ªÀë±µlµ¶¢Àv ¶plÐîlµí¶¢ ¶¢ÀÀËPÇB |
¶ªÀ±ÉAËlÇþñ±¸±¸lûµïB ¶¥ÀñiSµg¦P¹ S¿hµVµ±¼hÐ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 4 ||

±µk¸±µÃfûÐ SµVµÜ¶mêk¼£Àzhµ sûµÃlɶ¢ ¶pdËvÇB
¶ªÀåi q¸ñlµÀ±¸í¶¢A ¶pñi ¶¢ÀÀq¸Oµ±µäþï ¶ªlµ±ÀµÀB |
lµ±ÀµÃ »ªAlûµÀ±¸í¶mÀ¶ªùOµv YSµh¸A »ªAlûµÀ ¶ªÀhµ±ÀµÃ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 5 ||

¶p±µsñ¶®î ¾pfµB OµÀ¶¢v±ÀµÀ lµyÑhµÀëvô ¶m±ÀµÀmÐ
n¢¸¾ª ov¹lÓñ n»¬hµ Vµ±µgÑ„¶m¶må ¦±µ»ª |
±µ«¸¶mmÐç ±¸lû¸ ¶ª±µ¶ª ¶¢¶pÁ±¸wASµ¶m ¶ªÀPÑ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 6 ||

¶m ËÈ¢ q¸ñ±µæþïA ±¸YïA ¶m Vµ Oµ¶mOµh¸A sûÑSµ £sûµ¶¢A
¶m ±ÀµÃVÉ„¶¬A ±µ¶¢ÃïA nQvY¶m O¸¶¢ÃïA ¶¢±µ¶¢lûµÃA |
¶ªl¸ O¸vÉ O¸vÉ ¶pñ¶¢Àkµ ¶pim¸ S¿hµVµ±¼hÐ
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 7 ||

¶¬±µ hµöA ¶ªA«¸±µA lµÀñhµhµ±µ ¶¢À¥¹±µA ¶ªÀ±µ¶phÉ
¶¬±µ hµöA q¸q¸m¸A £hµhµ¶¢À¶p±¸A ±ÀµÃlµ¶¢¶phÉ |
C¶¬Ñ l¿m¸m¸kµA n»¬hµ¶¢ÀVµvA n¦Ûhµ¶plµA
YSµm¸ékµ «¸ö¤À ¶m±ÀµÀ¶m ¶pkµS¸¤À sûµ¶¢hµÀÊ¢À || 8 ||

 సర్వేజనాః సుఖినో భవంతు.

4 కామెంట్‌లు:

  1. There were many instances in history of literature, where either due to genuine misunderstanding or intentional posturing, literary works have been attributed to wrong authors. The instant clarification, thus, is an interesting revelation, that needs to be taken note of.
    Prof. Dr. NSR Sastry, Visakhapatnam

    రిప్లయితొలగించండి
  2. I sincerely feel that this is a needed literary clarification - N. Sriram

    రిప్లయితొలగించండి
  3. ఈ జగన్నాథాష్టకం పూజ్యులు (గీత గోవిందం -చందన చర్చిత...వ్రాసిన) శ్రీ జయదేవుల వారి తాతగారనీ,
    వారు ఆంధ్రులనీ హిందీ సాహిత్యపు పుస్తకాలలో ఎక్కడో చదివానండి.
    ఆంధ్రులని ఇప్పుడు మీరు ధృవీకరించారు. సంతోషమండి. ధన్యవాదములు. మరి శ్రీ జయదేవుల వారి గురించిన విషయంగురించి మీరు మరికొంత చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  4. శుభోదయం, నమస్సులు. చక్కని వివరణ, పరిశోధనాత్మక విశ్లేషణ. సర్వమంగళేశ్వర శాస్త్రి వారి దివ్యాత్మకు నమస్సులు.
    ఈ విషయాన్ని విరివిగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎలాగూ పూర్వాపరాలను చర్చించారు కనుక స్తోత్ర పూర్తి పాఠాన్ని కూడా యిక్కడ యిస్తే బాగుండేది. అభినందనలు, శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి