![]() |
| నవ గ్రహములు |
ఇందులో ఏ రెండు గ్రహాలు కూడా ఒక దానికొకటి ఎదురుగ ఉండవు. సూర్యుడు (Sun) తూర్పు ముఖంగా ఉంటాడు. సూర్యునికి తూర్పు దిక్కున శుక్రుడు (Venus), పశ్చిమాన శని (Saturn), ఉత్తరాన గురుడు / బృహస్పతి (Jupiter) దక్షిణ దిక్కున కుజుడు/అంగారకుడు/మంగళుడు (Mars), ఈశాన్య దిశను బుధుడు (Mercury), ఆగ్నేయాన చంద్రుడు (Moon), నైఋతి దిక్కున కేతువు (Neptune), వాయవ్య దిక్కున రాహువు (Pluto) ఉంటారు. రాహువుకు తల, కేతువుకు తోక మాత్రం ఉంటాయి. నవగ్రహ ఆరాధనను ఒక సాధారణ శ్లోకం తో చేయ వచ్చును.
నవగ్రహ శ్లోకం:
నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
ప్రతి పదార్ధం: నమః = నమస్కారం; సూర్యాయ = సూర్య గ్రహమునకు; చంద్రాయ = చంద్రగ్రహమునకు; మంగళాయ = మంగళ గ్రహమునకు; చ = మరియు; గురుః = గురు గ్రహానికి; శుక్రః = శుక్ర గ్రహానికి; శనిభ్యః = శని గ్రహమునకు; రాహుః = రాహువునకు; కేతవః = కేతువునకు; నమః = నమస్కారము.
తాత్పర్యము: నవగ్రహములైన సూర్యునకు, చంద్రునకు, మంగళునకు, బుధునికి, గురునికి, శుక్రునికి, శనికి, రాహువుకు, మరియు కేతువునకు నమస్కారములు.
