సూచిక

30, ఆగస్టు 2011, మంగళవారం

వినాయక చవితి నాడు వాడవలసిన పత్రి ఏది?

వినాయక చవితి అంటే ఎంతో సరదా చిన్నప్పటి నుంచి. పొద్దున్నే ఇంటి ఆవరణలో ఉన్న చెట్ల ఆకులను "పత్రి" పూజ కోసం కోసుకొస్తాం. అసలు పత్రి అంటేనే ఆకులు.అయితే ఏ ఆకులు దొరికితే వాటిని కోసుకోస్తాం. అందులో దూర్వాలు మాత్రం మరచిపోకండర్రా" అని అమ్మ చెప్పితే ముందు ఈ దూర్వాలంటే ఏమిటో తెలిసేది కాదు. "గడ్డి పరకలు" అనగానే "ఓస్! ఇంతేనా" అని అనుకుంటాం. "దూర్వా యుగ్మం" అంటే జంటగా ఉండే గరిక లేదా దర్భలు అంటే వినాయకునికి ప్రీతి.  అయితే, ఒక్క వినాయకుడికే ఈ పత్రి పూజ ఎందుకు చేస్తాం?  ఏయే ఆకులను పత్రిగా ఉపయోగిస్తారు?

      వినాయకుడు గజ ముఖుడు కదా! ఏనుగుకు ఇష్టమైనవి ఆకులు, కనుక పత్రి పూజ చేస్తాం. గణేశునికి "ఏక వింశతి" అంటే 21 రకాల పత్రితో పూజిస్తాము. అందులో తులసి ఆకులు కూడా వాడతాము. సాధారణం గా తులసి మాలలను శ్రీ కృష్ణునికి తప్ప మరెవరికి పూజలో ఉపయోగించము. ఈ ఇరవై ముఖ్యమైన పత్రి కాకుండా చాల రకాల పత్రిని వినాయకుని పూజలో వాడతాము. అయితే మనం నివసించే ప్రదేశాలలో పెరిగే చెట్లను బట్టి ఈ ఇరవై ఒక్క రకాలలో కొన్ని మార్పులు చేస్తుంటాం. ఉదాహరణకు నేరేడు, వెలగ వంటి పత్రి, వాటి పండ్లు అంటే వినాయకునికి ప్రీతి.  అయితే విషపూరితమైన మొక్కలను పిల్లలు తాకకుండా పెద్ద వాళ్ళు జాగ్రత్త పడాలి. అయితే ఈ ఇరవై ఒక్క రకాల పత్రిని ఎలా గుర్తు పడతాము? అందుకు వీలుగా ఈ దిగువన ఆయా ఆకుల బొమ్మలు పొందు పరచాను. 
 
"ఏక వింశతి పత్రి పూజ"
1. మాచీ పత్రం (మాచి పత్రి)
 2. బృహతీ పత్రం (వాకుడు)
 3. బిల్వ పత్రం (మారేడు)
4. దూర్వాలు (గరిక)
 5. దత్తూర పత్రం (ఉమ్మెత్త)
 6. బదరీ పత్రం (రేగు)
 7. అపామార్గ పత్రం (ఉత్తరేణి)
 8. తులసీ పత్రం (తులసి)
 9. చూత పత్రం (మామిడి)
 10. కరవీర పత్రం (గన్నేరు)

11. విష్ణుక్రాంత పత్రం (విష్ణుకాంత)
 12. దాడిమీ పత్రం (దానిమ్మ)
 13. దేవదారు పత్రం
14. మరువక పత్రం (మరువం)
 15. సింధువార పత్రం (వావిలి)
 16. జాజీ పత్రం (జాజి)
17. గండకీ పత్రం (దేవకాంచనం)
 18. శమీ పత్రం (జమ్మి)
 19. అశ్వత్థ పత్రం (రావి)
 20. అర్జున పత్రం (మద్ది)
 21. ఆర్క పత్రం (జిల్లేడు)

గణేశుని  పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఆయా పత్రిని సమర్పిస్తాము. ఆయా ఆకుల సంస్కృతము మరియు తెలుగు పేర్లు దిగువ పట్టికలో చూడగలరు.

సం. వినాయకుని నామము  పత్రి పూజయామి తెలుగు పేరు 
1. ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి మాచిపత్రి
2. ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి వాకుడు
3. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి మారేడు
4. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి గరిక 
5. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి ఉమ్మెత్త
6. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి రేగు 
7. ఓం గుహాగ్రజాయ నమః ఆపామార్గ పత్రం పూజయామి ఉత్తరేణి
8. ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి తులసి
9. ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి మామిడి
10. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి ఎర్ర గన్నేరు
11. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి విష్ణుకాంత
12. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి దానిమ్మ
13. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి దేవదారు
14. ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి మరువం
15. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి వావిలి
16. ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి జాజి
17. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి దేవకాంచనం
18. ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి జమ్మి 
19. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి రావి
20. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి తెల్ల మద్ది
21. ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి జిల్లేడు

 పత్రి పూజ వలన ప్రయోజనం ఏమిటి?
      వినాయకుని పూజలో ఉపయోగించే రకరకాల ఆకులలో చాల విశేషమైన ఔషధ గుణాలున్నాయి. అవి నేత్ర సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులకు, చర్మ రోగాలకు, మరి కొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పని చేస్తాయి. అంటే కాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. ఈ పత్రిలో గల వృక్ష సంబంధమైన రసాయన పదార్థాలు (phytochemicals), పత్రిని మనం చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరం లోకి శోషణం (absorb) చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. అందుకే వినాయకుని పూజ అంటే అందరికీ ఇష్టం.
 శ్రీ గణేష్ మహారాజ్ కి జై!

9 కామెంట్‌లు:

  1. విలువైన సమాచారం ఇచ్చారు.పత్రాలు పేర్లు విన్నాను కాని అవి ఎలా వుంటాయో,వ్యవహారిక భాషలో ఏమని పిలుస్తారో తెలియదు.మీరు ఫోటోతో సహా వేసి సందేహాన్ని తొలగించారు

    రిప్లయితొలగించండి
  2. లోకేష్ శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు. మీకు నచ్చినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  3. Chala bavunnadi suri garu,photo la to saha akulanu choopinchatam bavunnadi.durvayugma pooja lakshmi pradam antaru.meeku dani gurinchi telisthe adi kooda jataparachavachchu.

    రిప్లయితొలగించండి
  4. అనురాధ గారు, ధన్యవాదాలు. దూర్వాయుగ్మం గురించి నాకు కొద్దిగ తెలుసు. కొంచెం సమాచారం సేకరించాక జతపరచగలను.

    రిప్లయితొలగించండి
  5. మీరు ఫోటోలతో సహా పంపిన వివిధ పూజా పత్రాలు అందరికి తెలియచెప్పెలా ఉన్నాయి. గొప్ప ప్రయత్నం. Congratulations.
    వేణుగోపాల రావు, గుమ్మడిదల

    రిప్లయితొలగించండి
  6. Sury gaaru, pooja gurinchi chaala baaga chepparu. Mee prati blog entry adbhutam!

    రిప్లయితొలగించండి
  7. వేణు గారు ధన్య వాదాలు
    రవి గారు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  8. నమస్తే సూర్యనారాయణ గారు __/\__

    ఏకవింశతి పత్ర పూజ చాలాబాగా Photo లతో సహా చూపినందుకు ధన్యవాదాలందీ

    ప్రేమతో శక్తి

    రిప్లయితొలగించండి
  9. Thanks u very much for your valuable information .. all the best

    రిప్లయితొలగించండి