సూచిక

13, జూన్ 2020, శనివారం

ఇందరికి అభయమ్ములిచ్చు చేయి - అన్నమాచార్య కీర్తనఇందరికి నభయంబులిచ్చు

ఇందరికి నభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి॥


వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగిలించినచేయి
వలనైన కొనగోళ్ళ వాది చేయి    |ఇందరికి |
 
తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి  |ఇందరికి ॥

పురసతుల మానములు పొల్లసేసినచేయి
తురగంబు బరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలాదీశుడై మోక్షంబు -
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి    ॥ ఇందరికి ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి