జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి?" అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట. ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "ఆత్మ షట్కము" అని కూడా అంటారు. నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం.
శివోహమ్ శివోహమ్ శివోహమ్
1. మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
శివోహమ్ శివోహమ్ శివోహమ్
2. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః
న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః
న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
శివోహమ్ శివోహమ్ శివోహమ్
3. న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
శివోహమ్ శివోహమ్ శివోహమ్
4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్
న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః
అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
శివోహమ్ శివోహమ్ శివోహమ్
5. న మే మృత్యు శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
శివోహమ్ శివోహమ్ శివోహమ్
6. అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాసంగత నైవ ముక్తిర్ న మేయః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ (2)
శివోహమ్ శివోహమ్ శివోహమ్
ఈ షట్కము యొక్క తాత్పర్యం ఈ క్రింది లింకు లో చూడవచ్చును
శివోహమ్ శివోహమ్ శివోహమ్
షట్కం - అష్టకం కాదు. గమనించగలరు
రిప్లయితొలగించండికొత్త పాళీ గారు, ధన్యవాదాలు. పోస్టుచేసేముందు నాకు ఈ సందేహం కలిగింది. కొన్ని బ్లాగులలో శతకం అని ఇచ్చారు. అది షట్కం అని వెంటనే తట్టలేదు. మీ సూచనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసూర్యనారాయణ గారికి నమస్కారం.. ఈ అద్భుతమైన నిర్వాణ షట్కము నాకెంతో ఇష్టమైనది... ఇది ఎన్నిసార్లైనా , ఎవరు పాడినా చెవులప్పగించి వినాలనిపిస్తుంది... ఇక్కడ ఇచ్చినందుకు ధన్యవాదాలు... ఈ శ్లోకాలు అరవైలలో , డెభైలలో రేడియో లో వచ్చేది. అది పాడినది లతా మంగేష్కర్ అని నాకు గుర్తు. దానికోసం యేళ్ళబట్టి వెతుకుతున్నాను... మీదగ్గరగాని ఉంటే అందించరూ ?
రిప్లయితొలగించండిశ్రీ జనార్ధన శర్మ గారికి, నమస్కారం. నాబ్లాగు దర్శించినందుకు ధన్యవాదములు. మీరు కోరిన లతామంగేష్కర్ గారు గానం చేసిన ఆడియో నావద్ద లేదండి. క్షంతవ్యుడ్ని. నాకు దొరికిన యెడల మీకు పంపగలను.
రిప్లయితొలగించండిఅనువాదంలా కాక, వాడుక తెలుగులో అర్థం కొద్దిగా వివరించండి, బావుంటుంది.
రిప్లయితొలగించండిఎవరో ఒరిస్సా గాయని పాడిన పాట హైద్రాబాద్లో ఓ పొరుగు ఫ్లాట్ ఒరిస్సా అబ్బాయి వినేవాడు. తెలుగు రేడియోలో కూడా అదే అప్పూడప్పుడు వినిపించేది. ఎవరు పాడారోగాని, బాగా వుండేది.
SNKR గారు, మీ సూచనకు ధన్యవాదాలు. ఆ ప్రయత్నం లోనే వున్నాను. త్వరలో పోస్టు చేయగలను.
రిప్లయితొలగించండిసూర్యనారాయణ గారికి నమస్కారం..
రిప్లయితొలగించండి