సూచిక

1, జూన్ 2011, బుధవారం

గణేశ శ్లోకం: గజాననం భూత గణాధి - తాత్పర్యం

వెలగ పళ్ళు, రేగు పళ్ళు
 గణేశ శ్లోకం:
గజాననం భూత గణాధి సేవితమ్ 
కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్
ఉమా సుతం శోక వినాశ కారణమ్
నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్ 

ప్రతి పదార్ధం: గజ = ఏనుగు; ఆననం = ముఖము; భూత గణాది = భూత గణములు మొదలయిన; సేవితం = సేవించబడు; కపిత్థ = వెలగ; జంబూ = రేగు; ఫల = పండు/పళ్ళు; సార = గుజ్జు; భక్షితం = తినువాడు; ఉమ = పార్వతి; సుతం = పుత్రుడు/కొడుకు; శోక = దుఃఖం; వినాశ = నశింప జేయు; కారణం = కారణమైన వాడు; నమామి = నమస్కరింతును; విఘ్నేశ్వర = విఘ్నములకు అధిపతియైన వినాయకుని; పాద = పాదములు / చరణములు; పంక = బురద; = పుట్టినది; పంకజం = బురదలో పుట్టినది = కమలము/పద్మము. 

తాత్పర్యం:  గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, వెలగ మరియు రేగు పండ్ల గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖమును నశింప జేయుటకు కారణమైన వాడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి