సూచిక

25, మే 2011, బుధవారం

గణానాం త్వా గణపతి గమ్ -తాత్పర్యం

 
గణానామ్ త్వా గణపతిగ్‍ం హవామహే
కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్

ప్రతి పదార్ధం: గణానామ్=భూత గణములకు; త్వా=నిన్ను; గణపతిగ్‍ం= గణపతివి; హవామహే=ఆహ్వానించుచున్నాము; కవిమ్=కవివి; కవీనామ్=కవులలో; ఉపమ=పోలిక; అశ్రవస్తమమ్=మిక్కిలి అధికుడవు; జ్యేష్ఠ రాజమ్=రాజాధిరాజువు; బ్రహ్మణామ్=బ్రహ్మణ్యులలో; బ్రహ్మణస్పతే =గొప్ప బ్రహ్మణ్యుడవు; =అయిన; నః=మాకు; శృణ్వన్=ఆలకించి; ఊతిభిః=కోర్కెలు తీర్చువాడవై ; సీద=అలంకరించుము;సాదనమ్=ఆసనము/స్థానము.

తాత్పర్యం: భూత గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణ్యుడవు, సర్వ జగత్తుకు అధిపతివి (రాజాది రాజువు), అయిన నిన్ను మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి