సూచిక

11, మే 2011, బుధవారం

శ్రీ రామ శ్లోకం - ఆపదామప హర్తారం

శ్రీరాముడు
 కష్టాలను గట్టెక్కించే కరుణామూర్తి, మనకు వచ్చిన ఆపదలను తొలగించి శాంతిని సుఖాన్ని ప్రసాదించే పరంధాముడు ఆ శ్రీరాముడు. సుఖ, శాంతులు, ఆయురారోగ్యాలే కదా ఆయన మనకిచ్చే సంపదలు. ఆపత్కాలంలో ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని బాధలు తొలగిపోతాయని అందరి నమ్మకం. అటువంటి మహిమాన్వితుడైన సుందర రామునికి ఎల్లప్పుడూ తలచుకుంటాం. అదే ఈ శ్రీ రామ శ్లోకం.

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపద
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ 

ప్రతి పదార్ధం: ఆపదాం* = ఆపదలను; అపహర్తారం = పోగొట్టువాడు; దాతారం = ఇచ్చువాడు; సర్వ = అన్ని; సంపదాం = సంపదలను / సిరులను; లోకం  = లోకములో; అభిరామం = అందమైన వాడు; శ్రీరామం = శ్రీరాముని; భూయో భూయో (భూయః + భూయః) = మాటి మాటికి / పదే పదే; నమామ్యహం = నమామి + అహంఅహం = నేను; నమామి = నమస్కరిస్తున్నాను.

తాత్పర్యం: ఆపదలను పోగొట్టువాడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, లోకములో అతి సుందరమైన వాడైనట్టి శ్రీ రామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను.

*ఆపః = నీరు; దం = ఇచ్చేది; నీటిని అంటే ఈ సందర్భంలో కన్నీటిని ఇచ్చేది అనగా ఆపదలను కలిగించేది అనే అర్ధం ఉండవచ్చు. ఇది కేవలం నా ఊహ మాత్రమే.

3 కామెంట్‌లు:

  1. బాగున్నది. కాగా సంస్కృతం వ్రాసినప్పుడు వాక్యంలో చివరన వచ్చే మకారపు పొల్లును "0" గా కాక "మ్" గా వ్రాయాలి. అంటే ఫై శ్లోకంలో "నమామ్యహం" కాక "నమామ్యహమ్" అని అన్నమాట. సుభాకాక్షలు - న.శ్రీ.శాస్త్రి.

    రిప్లయితొలగించండి
  2. మామకు నమస్కారములు. చాల మంచి సూచన. తగిన మార్పులు చేస్తాను. ధన్యవాదాలు-సూరిబాబు

    రిప్లయితొలగించండి