గణేశ ప్రార్థన లేనిదే ఏ కార్యం మొదలెట్టం కదా! ఆఖరికి విష్ణు సహస్ర నామం ప్రారంభం కూడా వినాయకుని స్తుతితో మొదలవుతుంది. నా ఈ కొత్త బ్లాగును కూడా గణేషుని స్తుతితో ప్రారంభిస్తున్నాను. వీలైనంత వరకు సంస్కృత శ్లోకాలకు అర్ధం వివరిస్తూ భక్తికి సంబంధించిన విషయాలను నలుగురితో పంచుకోవాలనే ఓ చిన్న తపన - సూర్య నారాయణ వులిమిరి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
ప్రతి పదార్ధం: శుక్ల = తెల్లని; అంబర = వస్త్రం (ఆకాశం అని కూడా మరొక అర్థం); ధరం = ధరించిన వాడు; శశి = చంద్రుని; వర్ణం = రంగు గల; చతుర్ = నాలుగు; భుజం = భుజములు / బాహువులు; ప్రసన్న = సంతుష్టమైన; వదనం = ముఖము; ధ్యాయేత్ = ధ్యానింతును; సర్వ = అన్ని; విఘ్న = అడ్డంకులు; ఉపశాన్తయే = ఉపశమించుటకు / తొలిగి పోవుటకు.
తాత్పర్యం: తెల్లని వస్త్రములు ధరించినవాడు, సర్వవ్యాపకుడు, చంద్రుని వంటి కాంతి గలవాడు, నాలుగు భుజములు గలవాడు, సంతుష్ట మైన ముఖము కలవాడు అయిన గణపతిని అన్ని అడ్డంకులు తొలగింప జేయుటకై ప్రార్థిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి