సూచిక

10, ఆగస్టు 2011, బుధవారం

యద్యదాచరతి శ్రేష్ఠః: తాత్పర్యం

యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః 
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

పద విచ్చేదన: యద్ + యద్ + ఆచరతి + శ్రేష్ఠః + తద్ + తద్ + ఏవ + ఇతరః + జనః + స + యత్ + ప్రమాణః +కురుతే + లోకః + తద్ + అనువర్తతే

ప్రతి పదార్ధము
యద్ = ఏది; యద్ = ఏది; యద్యద = ఏవేవి;  ఆచరతి = ఆచరించునో; శ్రేష్ఠః  = శ్రేష్టుడు, ఉత్తముడు, ఉన్నతుడు; తత్తదేవ = తద్ + తద్ + ఏవ;  తద్ = దానిని; తద్ = దానిని; తత్త = ఆయా వాటిని; ఏవ = కేవలం, మాత్రము;  ఇతరః = ఇతరులైన;  జనః = జనులు; = కలసి; యత్ = ఏదైతే;  ప్రమాణం = ప్రమాణము, కొలబద్ద; కురుతే = తీసుకోనునో; లోకః = లోకము; తద్ = ఆవిధంగా; అనువర్తతే = అనుసరించును.

తాత్పర్యం: ఉత్తములు ఏయే వాటిని ఆచరింతురో ఆయావాటిని మాత్రమే ఇతర జనులు ప్రమాణముగా తీసుకుందురు. లోకము కూడా ఆ విధముగా అనుసరించును.

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి